బీసీసీఐ చీఫ్​ సెలక్టర్​గా సెహ్వాగ్​?

-

బీసీసీఐ చీఫ్​ సెలక్టర్​ పదవికి ఆ బోర్డు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో.. గౌతమ్​ గంభీర్​, యువరాజ్​ సింగ్​, హర్భజన్​ సింగ్​, వీరేంద్ర సెహ్వాగ్​ లాంటి పలు మాజీ క్రికెటర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఆ పోస్టు కోసం బోర్డు ఇదివరకే మాజీ స్టార్​ బ్యాటర్​ వీరేంద్ర సెహ్వాగ్​ను​ సంప్రదించిందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై వీరూని ప్రశ్నించగా ఆ వార్తలు అవాస్తవమని తోసిపుచ్చాడు.

vrendra sehwag post locust video at his home in gurugram

“సీఓఏ (కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్​) మీటింగ్​ సమయంలో, సెహ్వాగ్​ను ప్రధాన కోచ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయమని అడిగారు. కానీ అది అనిల్ కుంబ్లేకు వెళ్లింది. ఇప్పుడు ఈ పోస్ట్​కు అతడు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదు. ప్యాకేజీ కూడా అతడి స్థాయి ఉన్నవారికి ఆర్థికంగా లాభదాయకం కాదు.” అని ఓ బీసీసీఐ తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం సెహ్వాగ్​ పలు ప్లాట్​ఫారమ్​లపై అనలిస్ట్​గా ఉంటూ.. అందుకు తగిన జీతభత్యాల్ని తీసుకుంటున్నాడు. దీంతో రూ. కోటి ప్యాకేజీ ఇచ్చే ఈ చీఫ్​ సెలెక్టర్​ పదవికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని.. ఓ బీసీసీఐ అధికారి వెల్లడించినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news