భారీ స్కోరు చేసిన గుజరాత్.. ముంబై టార్గెట్ ఎంతంటే..?

-

ఐపీఎల్ లో భాగంగా ఇవాళ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 196 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభ్ మన్ గిల్ అద్భుతమైన సిక్సుతో చెలరేగిపోయాడు. గిల్ 38 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగులు చేశాడు. జాస్ బట్లర్ 39 పరుగులు చేశాడు. షారూఖ్ ఖాన్ 09 పరుగులు చేయగా.. రూథర్ ఫర్డ్ 18, రాహుల్ తెవాటియా డకౌట్ అయ్యాడు.

చివరి ఓవర్ లో రషీద్ ఖాన్ అద్భుతమైన సిక్స్ బాది ఔట్ అయ్యాడు. ఇక ముంబయి బౌలర్లలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లు తీశాడు. ముజీబ్ రెహ్మాన్ 1 వికెట్ తీయగా..దీపక్ అధిక పరుగులు సమర్పించుకొని 1 వికెట్ తీశాడు. బౌల్ట్ 1 వికెట్ తీశాడు. సత్యనారాయణ రాజు 1 వికెట్ తీశాడు. ముంబై జట్టు 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news