ఐపీఎల్ లో భాగంగా ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య హోరా హోరీ మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాజస్థాన్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పోరెల్ అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. 37 బంతుల్లో 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. జెక్ ఫ్రెసర్ 9 పరుగులు చేశాడు. కరణ్ నాయర్ డకౌట్ అయ్యాడు.
కే.ఎల్. రాహుల్ 38 పరుగులు చేయగా.. కెప్టెన్ అక్షర్ పటేల్ 34 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో సందీప్ శర్మ వరుసగా 4 వైడ్లు వేయడం 1 నెోబ్ ఎక్స్ ట్రా లు వేయడం విశేషం. అయితే చివరి ఓవర్ లో 19 రన్ లు రావడం గమనార్హం. స్టబ్స్ 33, అశుతోష్ 15 పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు, తీక్షణ 1, హసరంగ 1 వికెట్ తీశారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. దీంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు టార్గెట్ 189 పరుగులు.