కోరిక తీరిస్తే.. ఖర్చు భరిస్తానన్నాడు.. బ్రిజ్‌భూషణ్‌పై రెజ్లర్ల ఆరోపణలు

-

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌పై దిల్లీ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళా అథ్లెట్లను ఛాతీపై తాకడం, రెజ్లర్లతో అసభ్య పదజాలాన్ని ఉపయోగించి సంభాషించడం వంటివి చేసేవారని బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎఫ్‌ఐఆర్‌ కాపీలోని అంశాలను పలు జాతీయ మీడియా కథనాలు ప్రచురించాయి. బ్రిజ్‌ భూషణ్‌కు భయపడి మహిళా అథ్లెట్లు ఎప్పుడూ తమ గదుల్లో నుంచి బయటకు వచ్చినా బృందాలుగానే ఉండేవారట.

‘‘ఓ రోజు ఆయన నన్ను పిలిచి నా టీ-షర్ట్‌ లాగారు. శ్వాస ప్రక్రియను చెక్‌ చేస్తున్నానంటూ నా ఛాతీపై, పొట్టపై అభ్యంతరకరంగా తాకారు. ఓసారి నాకు తెలియని ఓ పదార్థాన్ని తీసుకొచ్చి తినమని చెప్పారు. దాని వల్ల ఫిట్‌గా ఉంటావని, ప్రదర్శన బాగా చేయొచ్చని చెప్పేవారు’’ అని మరో బాధితురాలు ఆరోపించింది.

‘‘విదేశాల్లో జరిగిన పోటీల్లో నేను గాయపడ్డాను. అప్పుడు బ్రిజ్‌భూషణ్‌ నా వద్దకు వచ్చి.. తనతో సాన్నిహిత్యంగా ఉంటే ట్రీట్మెంట్ ఖర్చులన్నీ ఫెడరేషనే భరిస్తుందని చెప్పారు’’ అని మరో బాధితురాలు తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version