ఆసియా కప్ 2024.. టీమ్ఇండియా స్క్వాడ్ ఇదే

-

మహిళల ఆసియా కప్ 2024 టోర్నీకి బీసీసీఐ టీమిండియా జట్టును ప్రకటించింది. 15మందితో కూడిన స్క్వాడ్ను బీసీసీఐ వెల్లడించింది. మరో నలుగురు ప్లేయర్లను ట్రావెలింగ్ రిజర్వ్గా ఎంపిక చేసింది. ఈ జట్టుకు హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా.. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్గా నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్ జూలై 19న ప్రారంభమై 28న ముగుస్తుంది. ఈ ఎడిషన్కు శ్రీలంక ఆతిథ్యమిస్తోంది.

భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), ఉమా ఛెత్రీ (వికెట్ కీపర్), పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన, యాదవ్ , శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.

ట్రావెలింగ్ రిజర్వ్: శ్వేతా సెహ్రావత్, సైకా ఇష్కే, తనూజా కన్వర్, మేఘనా సింగ్

ఈ టోర్నీలో తొలిరోజే హై వోల్టేజ్ గేమ్ భారత్- పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. ఈ ప్రతిష్ఠాత్మకమైన మ్యాచ్కు దంబుల్లా మైదానం వేదిక కానుంది. జులై 19 రాత్రి 7.00 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news