రెజ్లర్ల కీలక నిర్ణయం.. ఇక నుంచి అక్కడే పోరాటం

-

భారత రెజ్లింగ్​ సమాఖ్యతో.. డబ్ల్యూఎఫ్ మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్​సింగ్​పై పోరాటం ఇక నుంచి కోర్టులో చేస్తామని భారత స్టార్ రెజ్లర్లు స్పష్టం చేశారు. ఇకపై రోడ్లపై ఆందోళన చేయబోమని తెలిపారు. బ్రిజ్ భూషన్​ సింగ్​పై ఛార్జిషీటు దాఖలు చేస్తామన్న ప్రభుత్వం.. తమ మాట నిలబెట్టుకుందని అన్నారు. ఈ మేరకు వినేశ్​ ఫొగాట్​, సాక్షి మాలిక్, బజరంగ్​ పూనియా ట్విటర్​ వేదికగా పోస్టులు పెట్టారు.

‘జూన్ 7న జరిగిన సమావేశంలో మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల విషయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసింది. దిల్లీ పోలీసులు ఆరుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా దర్యాప్తు పూర్తి చేసి జూన్ 15న ఛార్జిషీట్ దాఖలు చేశారు. మాకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కోర్టులో కొనసాగుతుంది. వీధుల్లో కాదు. జులై 11న జరగనున్న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ విషయంలో ప్రభుత్వం వాగ్దానాల అమలు కోసం వేచి చూస్తాం’ అని రెజ్లర్లు ట్విటర్​లో పోస్టు చేశారు. అనంతరం కొద్ది సేపటికే తాము సోషల్​ మీడియా నుంచి కొంతకాలం విరామం తీసుకుంటున్నట్లు వినేశ్​ ఫొగాట్​, సాక్షి మాలిక్ ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news