Telugu Movies : టాలీవుడ్ హాఫ్ ఇయర్లీ రిజల్ట్స్.. బ్లాక్ బాస్టర్ హిట్ మూవీస్..

-

Telugu Movies : ఈ ఏడాది మొదలయ్యి అప్పుడే ఆరు నెలలు అయిపొయింది. ఈ ఆరు నెలల్లో బాగానే సినిమాలు వచ్చాయి. సమ్మర్ లో పెద్ద సినిమాలతో బిజీగా ఉండే సినీ పరిశ్రమ థియేటర్లు, ఈ సారి ఎన్నికలు, ఐపీఎల్ తో ఖాళీగానే ఉంది. మొత్తం ఈ ఆరు నెలల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులని మెప్పించి హిట్ కొట్టాయి, ఎన్ని కలెక్షన్స్ సాధించాయి అనేది ఒకసారి చూద్దాం…

జనవరి..

జనవరిలో ఎన్ని సినిమాలు విడుదలయ్యాయి.. ఎన్ని హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఎన్ని ప్లాప్ అయ్యాయి చూస్తే..

జనవరి 1 : సర్కారు నౌకరి.. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు. దీంతో పాటు మరో మూడు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యి పరాజయం పాలయ్యాయి.

జనవరి 5 : 5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోడానికి ఒక్క సినిమా కూడా ఆడకుండా రిలీజ్ అయి వెళ్లిపోయాయి.

జనవరి 12 : మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్ సినిమాలు రిలీజ్ అయి రెండు భారీ హిట్స్ కొట్టాయి.

జనవరి 13: వెంకటేష్ సైందవ్ రిలీజ్ అయ్యి ప్లాప్ అయ్యింది..

జనవరి 14: నాగార్జున నా సామిరంగ రిలీజయి డీసెంట్ హిట్ కొట్టి బ్రేక్ ఈవెన్ అయింది.

జనవరి 26 : హన్సిక 105 మినిట్స్ సినిమాతో పాటు మరో 5 చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇవేవి థియేటర్స్ వద్ద నిలబడలేదు..

ఫిబ్రవరి :

ఫిబ్రవరి 2: సుహాస్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ బూట్ కట్ బాలరాజు సినిమాలతో పాటు 7 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఫిబ్రవరి 8: వైఎస్ జగన్ బయోపిక్ గా తెరెకెక్కిన యాత్ర 2 సినిమా రిలీజయింది కానీ ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.

ఫిబ్రవరి 9 : రవితేజ ఈగల్ సినిమా రిలీజవ్వగా యావరేజ్ గా నిలిచింది.

ఫిబ్రవరి 15: అమరావతి రైతుల మీద తీసిన రాజధాని ఫైల్స్ రిలీజయింది.

ఫిబ్రవరి 16: సుందీప్ కిషన్ ఊరుపేరు భైరవకోన సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టాడు..

ఫిబ్రవరి 23: సుందరం మాస్టర్, మస్త్ షేడ్స్ ఉన్నాయి రాతో పాటు మరో 5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కమెడియన్ వైవా హర్ష హీరోగా మారి తెరకెక్కించిన సుందరం మాస్టర్ యావరేజ్ గా నిలిచింది.

మార్చి:

మార్చి 1 : భూతద్దం భాస్కర్ నారాయణ, చారి 111, ఆపరేషన్ వాలెంటైన్, వ్యూహంతో పాటు 4 చిన్న సినిమాలు రిలీజయ్యాయి.

మార్చ్ 8 : గామి, భీమలతో పాటు 4 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశ్వక్ సేన్, చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో ప్రయోగాత్మకంగా తీసిన గామి సినిమా మంచి హిట్ అయింది.

మార్చ్ 22: ఓం భీం బుష్, లైన్ మ్యాన్ తో పాటు మరో 3 చిన్న సినిమాలు రిలీజవ్వగా శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ హిట్ అవ్వగా మిగిలిన సినిమాలు ఫ్లాప్ బాట పట్టాయి.

మార్చ్ 29: సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా రిలీజయి 100 కోట్లు కలెక్ట్ చేసి భారీ హిట్ కొట్టింది.

ఏప్రిల్:

ఏప్రిల్ 5: విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా రిలీజయి యావరేజ్ గా నిలిచింది.

ఏప్రిల్ 11: అంజలి గీతాంజలి సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రిలీజయి యావరేజ్ గా నిలిచింది. సుహాస్ శ్రీరంగ నీతులు సినిమా నిరాశ పరిచింది.

ఏప్రిల్ 18: సత్యం రాజేష్ ముఖ్య పాత్రలో చేసిన టెనెంట్ రిలీజయి నిరాశ పరిచింది.

ఏప్రిల్ 19: మార్కెట్ మహాలక్ష్మి, పారిజాతాపర్వం, మరో 2 చిన్న సినిమాలు విడుదల అయ్యాయి..

ఏప్రిల్ 26: రెండు చిన్న సినిమాలు రిలీజయి ఇవన్నీ అడ్రెస్ లేకుండా పోయాయి.

మే:

మే 3: ఆ ఒక్కటి అడక్కు, బాక్, ప్రసన్న వదనం, శబరి, మరో చిన్న సినిమా రిలీజవ్వగా అన్ని కమర్షియల్ గా ఫ్లాప్స్ గా మిగిలాయి.

మే 10: సత్యేదేవ్ కృష్ణమ్మ, నారా రోహిత్ ప్రతినిధి 2, మరో 3 చిన్న సినిమాలు రిలీజయి అన్ని నిరాశ పరిచాయి.

మే 17: అసలు ఎవరికీ తెలియని ఓ 3 చిన్న సినిమాలు రిలీజై అటు నుంచి ఆటే వెళ్లిపోయాయి.

మే 24 : గెటప్ శ్రీను హీరోగా చేసిన రాజు యాదవ్ సినిమాతో పాటు విడుదలైన సినిమాలు ప్లాప్ అయ్యాయి.

మే 25: ఆశిష్, వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ ఇఫ్ యు డేర్ సినిమా యావరేజ్ గా నిలిచింది.

మే 31: రిలీజయిన కార్తికేయ భజే వాయు వేగం, ఆనంద్ దేవరకొండ గం గం గణేశా, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు యావరేజ్ గా నిలిచాయి.

జూన్:

జూన్ 7: నవదీప్ లవ్ మౌళి, శర్వానంద్ మనమే, కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాలు రిలీజయి యావరేజ్ గా నిలవగా పాయల్ రాజ్ పుత్ రక్షణ సినిమాతో పాటు మరో 4 చిన్న సినిమాలు రిలీజయి పరాజయం పాలయ్యాయి.

జూన్ 14: సుధీర్ బాబు హరోం హర, చాందిని చౌదరి ఏవమ్, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలతో పాటు మరో 2 చిన్న సినిమాలు రిలీజయ్యాయి.

జూన్ 21: వరుణ్ సందేశ్ నింద, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్ ప్రెస్ తో పాటు మరో 6 చిన్న సినిమాలు ప్లాప్ పడ్డాయి..

జూన్ 22: హెబ్బా పటేల్ సందేహం సినిమా ఫ్లాప్ గానే నిలిచింది.

జూన్ 27: వచ్చిన ప్రభాస్ కల్కి 2898AD సినిమా భారీ హిట్ కొట్టింది. ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది.. ఈ ఆరు నెలల్లో ఈ సినిమాలు విడుదల అయ్యాయి…

Read more RELATED
Recommended to you

Exit mobile version