ప్రజా పాలనలో యువ వికాస వసంతం.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

-

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్బంగా ప్రస్తుతం విజయోత్సవాల పేరిట తెలంగాణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ బుధవారం ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. నిత్యం నోటిషికేషన్ల విడుదలతో ప్రజాపాలనలో నిరుద్యోగం తగ్గుముఖం పట్టిందన్నారు. ఈ క్రమంలోనే బుధవారం పెద్దపల్లిలో ‘యువవికాసం’ పేరుతో ప్రభుత్వం భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ ఇటీవల ప్రభుత్వం కొలువులు సాధించిన వారిని నియామకపత్రాలను అందజేయనున్నారు. ఈసందర్బంగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. మొన్న కొలువులే ఆలంబనగా.. ఉద్యమం కొలిమిలా మండిందని, నిన్న కొలువులే ఆకాంక్షగా.. తన రణం జంగ్ సైరనై మోగిందని గుర్తు చేశారు. నేడు కొలువుల కలలు నిజమైన క్షణం.. ప్రజా పాలనలో యువ వికాస వసంతం అని, ఏడాదిలో 55 వేల ఉద్యోగ నియామకం అని వెల్లడించారు. నిత్య నోటిఫికేషన్ల తోరణం.. ఏడాది ప్రజా పాలనలో తగ్గుతున్న నిరుద్యోగం అని పేర్కొన్నారు. ఈ సంతోషాన్ని,ఆ ఆనందాన్ని నా యువ మిత్రులతో పంచుకునేందుకు పెద్దపల్లి నేడు వస్తున్నానని సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news