”SR కల్యాణమండపం” ట్రైలర్ విడుదల

-

“రాజావారు రాణిగారు” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం…. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రాజావారు రాణి గారు సినిమా తర్వాత “ఎస్ ఆర్ కళ్యాణ మండపం” సినిమా చేసాడు. ఇందులో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటించింది. శ్రీధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే నెల 6న రిలీజ్ కానుంది.

అయితే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. శ్రీధర్‌ గాదే దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై సాంగ్స్‌, టీజర్‌ తో అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు చిత్ర బృందం ఇవాళ థియేట్రికల్‌ ట్రైలర్‌ ను రిలీజ్‌ చేసింది. కంప్లీట్‌ ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ గా ఉన్న ఈ ట్రైలర్‌ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. మాస్‌ హీరోగా ఇమేజ్‌ తెచ్చుకునేందుకు కిరణ్‌ అబ్బవరం ప్రయత్నిస్తున్నాడు. మాస్‌ యాంగిల్‌ ఈ ట్రైలర్‌ లో స్పష్టంగా కనిపిస్తోంది. ట్రైలర్‌ చూశాక ఇక సినిమా ఎలా ఉంటుందోనని ప్రేక్షకులు అనుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version