నల్గొం:డ: జిల్లాలో టీఆర్ఎస్, కాంగ్రెస్ అధిపత్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం మంత్రి జగదీశ్, ఎమ్మెల్యే రాజగోపాల్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో రాజకీయం మరింత వేడిక్కింది. ఇవాళ మునుగోడులో రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు మంత్రి జగదేశ్ రెడ్డి ఏర్పాట్లు చేసుకున్నారు. దళిత బంధు మునుగోడులోనూ అమలు చేయాలంటూ అటు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
కాగా పోలీసుల చర్యను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పుబట్టారు. దళితబంధును రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గ్రామాల్లో తిరగనివ్వమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దళితులు ఏకం కావాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.