ఒకే టైటిల్​తో హిట్​ కొట్టిన ఎన్టీఆర్-నాగార్జున.. ఆ సినిమా ఏంటో తెలుసా?

-

మనిషికి పేరు ఎంత ముఖ్యమో ఓ చిత్రానికి కథతో పాటు టైటిల్ కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఓ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తోంది. అందుకే ఓ చిత్రానికి పేరు పెట్టడంలో దర్శకనిర్మాతలు తలబద్దలుకొట్టుకుంటారు. కానీ ఎట్టిపరిస్థితిలోనూ రాజీపడరు. హీరో పాత్ర, సినిమా కథకు తగ్గట్టు సరిపోయేలా పెడతారు. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు.. ఒక పేరే చాలామంది వ్యక్తులకు ఉన్నట్టు కొన్ని చిత్రాలకూ ఒకే పేరు ఉంటుంది. కథకు సరిగ్గా సరిపోయే పేరు పెట్టాలంటే ఇలా చేయక తప్పదు మరి! కథ డిమాండ్​ను బట్టి దర్శక నిర్మాతలు ఇలా చేస్తుంటారు.

అయితే ఇలా కథ వేరైనా ఒకే పేరుతో చాలా సినిమాలే వచ్చాయి. ఇందులో తెలుగు తెరకు ఆరాధ్య దైవం అయిన‌ నందమూరి ఎన్టీ రామారావు, అక్కినేని వారసుడిగా వెండితెరకు పరిచయమైన నాగార్జున చిత్రాలు ఒకటి. వీరిద్దరు వేర్వేరుగా ఎదురులేని మనిషి అనే ఒకే టైటిల్​తో సినిమాలు చేశారు.కె.బాపయ్య దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ‘ఎదురులేని మనిషి’ 1975 డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది. అశ్వనీదత్ నిర్మాత. శేఖర్(ఎన్టీఆర్) తండ్రిని తన బాల్యంలో ఇద్దరు దుండగులు హత్య చేస్తారు.

ఆ హత్య చేసిన వాళ్ళను గుర్తు పెట్టుకొని శేఖర్ తన తమ్ముడు గోపితో కలిసి పారిపోతాడు. ఆ తర్వాత శేఖర్, గోపీలు విడిపోవడం జరుగుతుంది.ఒకవైపు తండ్రిని చంపిన హంతకుల మీద పగ సాధించాలన్న పట్టుదల, మరో పక్క దూరమైన తమ్ముడిని ఎలాగైనా కలుసుకోవాలి అని శేఖర్ ప్రయత్నిస్తుంటాడు. అలా స్మగ్లర్ల కార్యకలాపాలను అడ్డుకుంటూ తన తమ్ముడిని ఎలా కలుసుకున్నాడు అనేది ఎన్టీఆర్ ఎదురులేని మనిషి చిత్ర కథాంశం.

2001లో నాగార్జున హీరోగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘ఎదురులేని మనిషి’. ఈ చిత్రంలో నాగార్జున సరసన సౌందర్య, షెహనాజ్ హీరోయిన్స్​గా నటించారు. కోటా శ్రీనివాసరావు, బ్రహ్మానందం, నాజర్, యమున పలువురు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో నాగార్జున ద్విపాత్రాభినయంలో కనిపించారు. ఊరికి పెద్దమనిషి అయిన‌ సూర్యమూర్తి(నాగార్జున) తన తాత, బామ్మ‌, ఓ పాపతో కలిసి ఉంటాడు. సూర్యమూర్తి రూపాన్ని పోలి ఉన్న అతని తమ్ముడు సత్య(నాగార్జున) హైదరాబాద్​లో ఇంజినీరింగ్ పూర్తి చేసుకొని ఊరికి వస్తాడు.

ఎప్పటికీ పెళ్లి చేసుకోను అని భీష్మించుకు కూర్చున్న తన అన్నయ్యకు ఎలాగైనా పెళ్లి చేయాలి అని సత్య భావిస్తాడు. అలా తన అన్న సూర్యమూర్తిని.. అతడిపైనే పగ పెంచుకున్న వసుంధరను(సౌందర్య)ఇచ్చి పెళ్లి చేస్తాడు. మరి చివరకు సౌందర్య.. తన తప్పును ఎలా సరిదిద్దుకుంది, ఊరిలో ఉన్న ప్రతినాయకులను నాగార్జున ఎలా మట్టుబెట్టారు అనేది కథాంశం.అయితే ఒకే టైటిల్​తో వచ్చిన ఈ చిత్రాల్లో ఎన్టీఆర్ ఎదురులేని మనిషి బాక్సాఫీస్​ ముందుగు ఘన విజయాం సాధించిన.. నాగార్జున ఎదురులేని మనిషి పర్వాలేదనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news