Sreeleela : బ్లాక్​డ్రెస్​లో ధమాకా బ్యూటీ శ్రీలీల పరువాల విందు

-

ధమాకా బ్యూటీ శ్రీలీల సోషల్ మీడియాలో హల్​చల్ సృష్టిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసి ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. బ్లాక్ డ్రెస్​లో బోల్డ్ లుక్స్​లో ఈ భామ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. తన పరువాలు చూపిస్తూ కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తోంది. ధమాకా సక్సెస్​తో ఫుల్ జోష్​లో ఉంది ఈ బ్యూటీ.

పెళ్లిసందడి సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమా సెట్స్​పై ఉండగానే అరడజను ఆఫర్లు తన బుట్టలో వేసేసుకుంది. పెళ్లిసందడి ఫ్లాప్ అయినా.. ఈ భామకు ఆఫర్లకు కొదువేం రాలేదు. వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ టాలీవుడ్ టాప్ హీరోయిన్లకు ఛాలెంజ్ చేస్తోంది ఈ బ్యూటీ.

ఇక రవితేజతో నటించిన ధమాకాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన శ్రీలీల రెండో సినిమాకే వంద కోట్ల క్లబ్​లో చేరిపోయింది. ఆ సినిమా హిట్ ఇచ్చిన జోష్​లో వరుస సినిమాలు చేస్తూ బిజీ అయింది. ప్రస్తుతం ఈ భామ మహేశ్ బాబు, రామ్, బాలయ్య బాబు సినిమాల్లో నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news