ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ నిన్న అట్టహాసంగా చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ , కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న మూడవ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇదిలా ఉంటే… క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్ తగలనుందా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మ్యాచ్ కు గంట సేపు బ్రేక్ పడనుందా? అనే విషయం పై పూర్తి వివరాల్లోకి వెళితే.. మార్చి 23 ఈ డేట్ కు ఓ స్పెషాలిటి ఉంది. అదేంటంటే? ప్రతీ సంవత్సరం ఈ రోజులో ఒక గంట పాటు ప్రపంచ వ్యాప్తంగా లైట్లు ఆర్పేసి భూమాతకు మద్ధతుగా నిలవాలి. ఈ రోజు రాత్రి 8:30 గంటల నుంచి 9:30 వరకు అంటే గంట సేపు ప్రపంచ వ్యాప్తంగా లైట్లు ఆర్పేయనున్నారు. ఇందులో 190 దేశాలు భాగస్వామ్యం అయ్యాయిఅవర్ లో భాగంగా వాతావరణ మార్పులు, పర్యావరణంపై అవగాహన కల్పించే ఉద్దేశంలో భాగంగా దీని నిర్వహిస్తున్నారు.ప్రతి సంవత్సరం ఎర్త్ అవర్ అనే కాన్సెప్ట్‌ను వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ నిర్వహిస్తోంది.ఈ సంవత్సరం ఇవాళ రాత్రి 8:30 నుంటి 9:30 గంటల సమయంలో ఎర్త్ అవర్ పాటించాలని కోరారు. ఇందులో భాగంగా ఇళ్లు, కార్యాలయాల్లోని లైట్లు, ఎలక్ట్రికల్ ఉపకరణాలను ఆపివేయాలని పేర్కొన్నారు.