సన్ రైజర్స్ హైదరాబాద్ మరో సారి నిరాశ పర్చింది. సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. కాగ ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇప్పటికే రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయిన హైదరాబాద్.. రెండు ఓటమిలను మూటగట్టుకుంది. దీంతో ఐపీఎల్ పాయింట్ల పట్టికల్లో చివరి స్థానంలోనే ఉంది. కాగ సోమవారం నాటి మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులు చేసింది.
170 భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఓపెనర్లు కేన్ విలియమ్సన్ (16), అభిషేక్ శర్మ (13) వెను వెంటనే పెవిలియన్ బాట పట్టారు. మార్క్రమ్ (12) కూడా విఫలం అయ్యాడు. రాహుల్ త్రిపాటి (44), నికోలస్ పూరన్ (34) తో పాటు సుందర్ (18) రాణించారు. అయితే చివర్లో సమద్ (0), రోమారియో షెఫర్డ్ (8), భూవనేశ్వర్ (1) విఫలం అయ్యారు. దీంతో భారీ లక్ష్యం ముందు హైదరాబాద్ చెతులేత్తేసింది. కాగ లక్నో బౌలర్ అవేశ్ ఖాన్ 4 వికెట్లు పడగొట్టి సన్ రైజర్స్ ను దెబ్బతీశాడు. దీంతో అవేశ్ ఖాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.