వన్డే వరల్డ్ కప్ ఆఖరి లీగ్ మ్యాచులో శ్రీలంక ఆలౌట్ ప్రమాదంలో పడింది. కివీస్ బౌలర్ల ధాటికి టాపార్డర్‌తో సహా మిడిలార్డర్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఫెర్గూసన్ ఓవర్లో చమిక కరుణరత్నే(6) ఔటవ్వడంతో 8 వికెట్లు కోల్పోయింది. 70 పరుగులకే 5 వికెట్లు పడగా.. కష్టాల్లో కూరుకుపోయిన లంకను ఆదుకునే ప్రయత్నం చేసిన డేంజరస్ మాథ్యూస్(0), ధనంజయ డిసిల్వా(4)ను స్పిన్నర్ శాంట్నర్ వెనక్కి పంపాడు. ప్రస్తుతం థీక్షణ(2), చమీర ఆడుతున్నారు. 30 ఓవర్లకు లంక స్కోర్.. 125 /8. చమీర 17 బంతులను ఎదుర్కొని ఖాతాని కూడా ఓపెన్ చేయలేదు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకు ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ పథుమ్ నిస్సంక(2) ను టిమ్ సౌథీ పెవిలియన్ పంపాడు. అనంతరం డేంజరస్ బౌల్ట్ వికెట్ల వేట మొదలెట్టాడు. అతడు విజృంభించడంతో.. ఒకే ఓవర్లో కెప్టెన్ కుశాల్ మెండిస్(6), సమరవిక్రమ (1) ఔటయ్యారు. ధాటిగా ఆడుతున్న కుశాల్ పెరీర(51 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫెర్గూసన్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి శాంట్నర్ చేతికి చిక్కాడు. దాంతో, లంక 70 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతకుముందు ట్రెంట్ బౌల్ట్ వేసిన ఓవర్లో చరత అసలంక(8) ఎల్బీగా వెనుదిరిగాడు.