మహేష్ చేతుల మీదుగా “శ్రీదేవి సోడా సెంటర్” ట్రైలర్

-

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్ర లో కరణ కుమార్‌ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సినిమా “శ్రీదేవి సోడా సెంటర్‌”. ఈ సినిమా ను పలాస సినిమా ఫేం దర్శకుడు కరుణ కుమార్‌ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అనే ఆసక్తి టాలీవుడ్‌ ప్రేక్షకుల్లో నెలకొంది. ఇక ఈ సినిమాకు మణి శర్వ సంగీత స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల అయిన సాంగ్స్‌ ఈ సినిమా ను మరో రేంజ్‌ కు తీసుకువెళ్లాయి. ఈ నేపథ్యం లోనే ప్రమోషన్స్‌ స్పీడ్‌ పెంచింది చిత్ర బృందం.

కాగా.. తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్టేట్‌ వచ్చేసింది. ఈ సినిమా ట్రైలర్‌ ను కాసేపటి క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్‌ ను ప్రిన్స్‌ మహేష్‌ బాబు చేతుల మీదుగా రిలీజ్‌ చేశారు. ఇక ఈ ట్రైలర్‌ లో సుధీర్‌ బాబు మాస్‌ లుక్‌ లో కనిపించాడు. అదిరిపోయే డైలాగు లో అదరగొట్టాడు. ట్రైలర్‌ చూస్తుంటే.. ఈ సినిమా పూర్తిగా శ్రీదేవి చుట్టే తిరిగేలా కనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌ సినిమా రేంజ్‌ ను మరింత పెంచేసింది.

Read more RELATED
Recommended to you

Latest news