ట్రిపుల్ ఆర్ పై ఓ శ్రీకాకుళం అభిమాని స్పంద‌న.. ! ఏంటంటే ?

-

ఒక మాట అబద్ధమేమో ! అనుకునేలా చేసింది..ఈ రోజు రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమా. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అంటారు. ఒక ఒరలో కత్తు లేనా..ఒక సినిమాలో ఇద్దరు కత్తి లాంటి హీరోలను పెట్టినా ఇంచుమించు ఇదే త‌ర‌హా మాట అంటారు. కానీ ఈ రోజు ట్రిపుల్ ఆర్ సినిమా చూశాక ఆ మాట అబ‌ద్ధ‌మేమో! అనిపించింది. అనిపించ‌డ‌మేంటి ? త‌ప్పు ! ఆ మాటే త‌ప్పు అని నిర్థార‌ణ అయింది కూడా !

ఎన్టీఆర్ ని కొమురం భీమ్ పాత్రలో..చరణ్ ని అల్లూరి సీతా రామరాజు పాత్రలో.. తెర‌పై చూశాక! క‌న్నార్ప‌డం ఎవ్వ‌రి త‌రం కాదు.ఇంతవరకూ మా హీరో ఫైట్స్ బాగా చేశాడు..డాన్స్ బాగా చేశాడు..అని మాట్లాడుకునే ఫ్యాన్స్..ఈ రోజు ట్రిపుల్ ఆర్ సినిమా చూశాక..మా హీరో మంచి పాత్ర చేశాడు అని మాట్లాడుకుంటారు.

బాలీవుడ్ మీడియా ఆర్‌ఆర్ఆర్ సినిమాని పెద్దగా ప్రమోట్ చేయలేదు. సినిమా చూశాక కూడా! ఆ..మీడియా అదేవిధంగా ప్రవర్తిస్తే ..ఆ మీడియా బాలీవుడ్ మీడియా కాదు బ్రిటిష్ వాళ్ళు మీడియా అవుతుంది. కంచెలు తెంచే విధంగా దేశభక్తి ఉన్న ప్రతి ఒక్క భారతీయుడూ..గర్వించదగ్గ సినిమా ట్రిపుల్ ఆర్.

– సతీశ్ పీస,సినీ అభిమాని,శ్రీ‌కాకుళం.

Read more RELATED
Recommended to you

Exit mobile version