ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా చివరి అంకానికి చేరుకుంది.. ఈ రోజు పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న మొదటి సెమీఫైనల్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ నిర్ణీత ఓవర్ లలో 9 వికెట్లు నష్టపోయి 322 పరుగులు చేసింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో ఓపెనర్లు విఫలం అయినా, ఓమైర్ యూసఫ్ 88 పరుగులు , మహమ్మద్ హారిస్ 52, ముబాషిర్ ఖాన్ 42 మరియు మహమ్మద్ వసీం 23 ఆఖర్లో మెరుపులు మెరిపించి టార్గెట్ ను 322 కు పెంచారు. ఒకదశలో కనీసం పరుగులు చేస్తే చాలు అనుకుంటే… అమాంతం టార్గెట్ ను పెంచేశారు యంగ్ ప్లేయర్లు. ఇక శ్రీలంక బౌలర్లు మిడిల్ ఓవర్ లలో పరుగులు కట్టడి చేయడంలో విఫలం అయ్యారు అని చెప్పాలి. ఇక బౌలర్లలో సమరకూన్, మధుశన్ మరియు కరుణరత్నే లు తలో రెండు వికెట్లు తీసుకున్నారు.
కాగా శ్రీలంకకు ఉన్న బ్యాటింగ్ లైన్ అప్ చూస్తే ఈ టార్గెట్ ను ఛేదించడం అంత కష్టం కాదు. మరి చూద్దాం ఎమర్జింగ్ కప్ లో ఫైనల్ చేరనున్న మొదటి జట్టు ఏదో ?