ఫ్లాట్‌ఫామ్‌పై ఉన్న వందేభారత్‌ రైలులో మూత్రవిసర్జన చేశాడు.. సీన్‌ కట్‌ చేస్తే రూ. 6వేలు లాస్‌

-

వందేభారత్‌ రైలు గురించి మీకు తెలిసే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఈ రైలు పలు రాష్ట్రాల్లో నడుస్తుంది. అయితే ఈ మధ్య ఈ రైలు విచిత్రమైన సంఘటనలతో వార్తల్లో ఎక్కింది. అంతెందుకు హైదరాబాద్‌లో ఈ రైలు స్టాట్‌ అయినప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం అని ఎక్కి అందులోని ఇరుక్కుపోయి ఏకంగా తిరుపతి వరకూ వెళ్లిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు వందేభారత్ రైలులో మూత్ర విసర్జనకు వెళ్లిన ఓ వ్యక్తి రూ.6వేలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో చోటుచేసుకుంది.

vande bharat train

ఖాదిర్ తన భార్య, ఎనిమిదేళ్ల కొడుకుతో కలిసి హైదరాబాద్ నుంచి మధ్యప్రదేశ్‌లోని తన స్వగ్రామం సింగ్‌రౌలీకి వెళ్తున్నాడు. అబ్దుల్ ఖాదిర్‌కు హైదరాబాద్, సింగ్రౌలీలో రెండు డ్రైఫ్రూట్ షాపులు ఉన్నాయి. హైదరాబాద్ నుంచి భోపాల్‌కు వచ్చిన ఖాదిర్ కుటుంబం సింగ్రౌలీకి వెళ్లేందుకు రైలు కోసం ఎదురుచూస్తోంది. ఇంతలో ఖాదీర్‌కు టాయిలెట్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఫ్లాట్‌ఫామ్‌పై ఆగి ఉన్న వందే భారత్ రైలులోని బాత్రూమ్‌కు వెళ్లాడు. అయితే, రైలు ఎక్కిన కొద్ది సెకన్లకే స్టాట్‌ అయింది. అది గమనించిన ఖదీర్ వెంటనే భయంతో పరిగెత్తాడు కానీ రైలు తలుపులు అప్పటికే లాక్‌ అయ్యాయి.

వెంటనే ఖదీర్ వేర్వేరు కోచ్‌లలో ఉన్న ముగ్గురు టికెట్ కలెక్టర్లు, నలుగురు పోలీసుల సహాయం కోరాడు. అయితే రైలు డోర్‌ను డ్రైవర్ మాత్రమే తెరవగలడని వారుచెప్పారు. ఖాదిర్‌ డ్రైవర్‌ను వెంబడించి వెళ్లబోతుండగా, టికెట్‌ లేకుండా ప్రయాణించినందుకు అతడిని ఆపి రూ.1020 జరిమానా విధించారు.

వందేభారత్ రైలు ఉజ్జయిని స్టేషన్‌లో ఆగింది. అప్పుడు ఖదీర్ రైలు దిగి 750 రూపాయలు చెల్లించి బస్సులో భోపాల్‌కు తిరిగి వచ్చాడు. అబ్దుల్ రైలులో ఇరుక్కుపోవడంతో భయాందోళనకు గురైన అతని భార్య, కుమారుడు ఏం చేయాలో తెలియక సింగ్రోలి వెళ్లాల్సిన రైలు ఎక్కకూడదని నిర్ణయించుకున్నారు.
వందే భారత్‌లో ఇప్పటికే రూ.1020 జరిమానా చెల్లించిన ఖదీర్ తిరిగి భోపాల్ వెళ్లేందుకు రూ.750 చెల్లించాడు. ఇప్పుడు సింగ్రౌలీకి వెళ్లేందుకు ముందుగా బుక్ చేసుకున్న 4000 కూడా వృథా అయిపోయింది. వందేభారత్ టాయిలెట్‌లో మూత్ర విసర్జన చేయాలని అబ్దుల్ ఖాదిర్ హడావుడిగా తీసుకున్న నిర్ణయంతో దాదాపు రూ.6,000 నష్టపోయాడనమాట.!

ఇంత జరిగినా, వందేభారత్ రైళ్ల అత్యవసర వ్యవస్థ విఫలమైందని ఖదీర్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఆ కుటుంబం కూడా రైలులో చిక్కుకుపోవడంతో మానసికంగా వేధింపులకు గురికావాల్సి వచ్చిందని అబ్దుల్ దుయ్యబట్టారు. ఈ ఘటనపై భోపాల్ రైల్వే డివిజన్ పీఆర్‌ఓ సుబేదార్ సింగ్ స్పందిస్తూ, రైలు సర్వీసును ప్రారంభించే ముందు వందే భారత్ ఏ దిశలో తలుపులు తెరుస్తారో, ఏ దిశలో డోర్లు లాక్ చేయబడతాయో ప్రకటిస్తామని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా, ప్రయాణికుల భద్రత కోసం డోర్లకు తాళాలు వేసి ఉంచారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే రైలును ఆపగలమని తెలిపారు.

అందుకే రైల్వే స్టేషన్లో ఇలాంటి తీట పనులు చేయకూడదు. ఇప్పటికే చాలా మంది వందేభారత్‌ రైలు ఎలా ఉంటుందో చూద్దాం, ఫోటోలు దిగుదాం అని అలా ఎక్కేసి ఇరుక్కుపోయి డబ్బు, టైమ్‌ వృధా చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న పని ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవచ్చు. రైలు స్టాట్‌ అయ్యే ఐదు నిమిషాల ముందు అనౌన్స్‌మెంట్‌ ఇస్తే ఇలా జరగకపోవచ్చు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news