బైరెడ్డి పెళ్లాంగా ఒక్క రోజు చాలు.. తర్వాత చచ్చినా ఓకే – శ్రీరెడ్డి..!

-

శ్రీరెడ్డి.. విచ్చలవిడిగా కామెంట్లు చేయడం.. బూతులు మాట్లాడటం.. రెచ్చగొట్టే కామెంట్లు చేయడం ద్వారా బాగానే పాపులర్ అయ్యింది. ఏదైనా చేయ్..కానీ పాపులర్ కావాలి అన్నది ఆమె పాలసీగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఆమె క్యాస్టింగ్ కౌచ్, సినీ ఇండస్ట్రీ గురించి ఎన్నో కాంట్రవర్సీ కామెంట్లు చేసింది.

కానీ ఇప్పుడు తొలిసారిగా ఓ రాజకీయ నాయకుడి గురించి పచ్చిగా మాట్లాడుతోంది. తాను ఓ వైసీపీ కుర్ర నేతపై మనసు పారేసుకుందట. అతనికి కనీసం ఒక్కరోజైనా భార్యగా బతకాలని ఉందంటూ ఘాటుగా కామెంట్ చేసింది. అతడితో ఒక్కరోజు భార్యగా గడిపిన తర్వాత చచ్చినా పర్లేదంటోంది శ్రీరెడ్డి. ఇంతకీ ఆ ఒక్క మగాడు ఎవరనేగా మీ సందేహం.

అతడే.. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఈ యువనాయకుడు కర్నూలు జిల్లా రాజకీయాల్లో బాగానే పాపులర్.. కేసీఆర్ తరహాలో మంచి మాటకారి కూడా. నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ గా ఉన్నాడు. అక్కడ పార్టీని గెలిపించాడు. నేర చరిత్ర ఉన్నా.. మాస్ లీడర్ గా గుర్తింపు పొందాడు. జగన్ తో కూడా మంచి రిలేషన్ ఉందంటారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి తన తమ్ముడు అని జగన్ ఓసారి కామెంట్ చేశారు.

ఇప్పుడు ఈ సిద్దార్ధ్ రెడ్డి ఈ శ్రీరెడ్డి మనసు దోచినట్టున్నాడు. నేను తొలిసారిగా నా పెళ్లి గురించి పోస్ట్ పెడుతున్నా అంటూ సోషల్ మీడియాలో ఒకరోజు ముందే శ్రీరెడ్డి పోస్ట్ పెట్టింది. అందరిలోనూ క్యూరియాసిటీ పెంచేసి.. అతగాడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అని తేల్చేసింది. అతడికి ఒక్కరోజైనా పెళ్లాంగా ఉంటే చాలు.. ఆ తరువాత చనిపోయినా పర్లేదు అంటూ రెచ్చిపోయింది. మరి అతగాడు ఎలా స్పందిస్తాడో.

Read more RELATED
Recommended to you

Exit mobile version