థియేట‌ర్లో రెచ్చి పోయిన తమన్…లాలా భీమ్లా పాట‌కు డ్యాన్స్

-

ప‌వ‌న్ క‌ళ్యాన్, రానా క‌లిసి న‌టించిన “భీమ్లా నాయ‌క్” నిన్న విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్సీస్ లో కూడా దుమ్ము లేపుతుంది. భీమ్లా నాయ‌క్ సినిమాపై సినీ ప్ర‌ముఖుల‌తో పాటు రాజ‌కీయ ప్ర‌ముఖులు కూడా స్పందిస్తున్నారు. ఇలాంటి సినిమా చూడలేద‌ని కామెంట్ చేస్తున్నారు.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ విశ్వ రూపం చూశామ‌ని అభిమానులు సోషల్ మీడియా ద్వారా చెబుతున్నారు. డాన్సులు, కటౌట్లకు పాలాభిషేకాలు, టపాసులు పేల్చుతూ.. థియేటర్ల వద్ద హోరెత్తిస్తున్నారు. వారిలో సంగీత దర్శకుడు తమన్‌ కూడా కలిసి పోయారు.

ఈ సినిమాకు ఆయనే మ్యూజిక్‌ అందించిన సంగతి తెలిసిందే. ఓ థియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లిన తమన్‌… లాలా భీమ్లా పాట వస్తున్న సమయంలో.. తెర వద్దకు వెళ్లి అభిమానులతో.. కలిసి చాలా హుషారుగా డ్యాన్స్‌ చేశారు. దీంతో.. అభిమానుల్లో మరింత జోష్‌ నిండింది. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను తమన్ స్వయంగా సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీంతో క్షణాల్లో ఈ వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version