కరోనా కేసుల రికవరీలు పెరగడంతో వ్యాక్సిన్ పై వచ్చిన ఆశాజనక వార్తలతో ఈక్విటీ మార్కెట్లో కాస్త పుంజుకున్నాయి. దీంతో పసిడి ధర ఆ ప్రభావం కనబడుతోంది. ఇకపోతే నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేటి ఉదయం ఎంసిఎక్స్ లో 10 గ్రాముల గోల్డ్ ఫీచర్స్ 0.04 శాతం తగ్గి రూ 49,137 పలికింది. అలాగే వెండి ధర ఫీచర్స్ లో 0.13 శాతం పడిపోయి కిలో రూ. 52,990 ముగిసింది. దీంతో ఢిల్లీ మార్కెట్లో నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గి రూ. 50 వేల దిగువకు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.48 వేలకు చేరుకుంది.
అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120 పెరిగి రూ. 51,290 కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,130కి చేరుకుంది. ఇక మరోవైపు స్టాక్ మార్కెట్ విషయం కొస్తే సెన్సెక్స్ 419 పాయింట్లు బలపడి 36471 వద్ద ముగియగా, నిఫ్టీ 121 పాయింట్లు లాభపడి 10739 వద్ద ముగిసాయి.