అభిమానులతో స్టార్ హీరో సెల్ఫీ …….వీడియో వైరల్

-

ఎప్పుడెప్పుడా అని ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ పొలిటికల్ అరంగేట్రంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు దళపతి విజయ్ శుభ వార్త చెప్పిన విషయం తెలిసిందే. విజయ్ రాజకీయ ప్రవేశానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

‘తమిళగ వెట్రి కజగం’ పేరుతో రాజకీయ పార్టీ ప్రకటించినప్పటి నుంచి విజయ్ తమిళనాట హాట్ టాపిక్గా మారారు. ఆయన ఫ్యాన్స్ తన ఇంటి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన తన అభిమానులతో సెల్ఫీ వీడియో తీసుకున్నారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాను చేస్తున్న G.O.A.T సినిమానే తనకు చివరిదని విజయ్ ప్రకటించడం తెలిసిందే.ఈ సినిమా డైరెక్టర్‌ కార్తీక్‌ సుబ్బరాజు దర్శకత్వంలో చేయనున్నాడు.సన్ పిక్చర్స్‌ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మించనున్నారు. GOATలో ప్రశాంత్‌, ప్రభుదేవా, లైలా, స్నేహ, మిక్ మోహన్‌, జయరాం,యోగిబాబు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీలో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news