స్టార్ హీరో కూతుర్ని రేప్ చేస్తామని బెదిరింపులు…!

తమిళ సమాజం నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి రావడంతో ప్రముఖ దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీ ధరన్ బయోపిక్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం విజయ్ కుమార్తెను రేప్ చేస్తామని బెదిరిస్తున్నారు. విజయ్ సేతుపతి పోస్ట్ చేసిన ట్వీట్‌ కు సమాధానంగా కొందరు అతని కుమార్తెను రేప్ చేస్తామని బెదిరించారు.Vijay Sethupathi - Wikipedia

అప్పుడు మాత్రమే తన ఈలం తమిళుల బాధ అనేది అతనికి అర్ధమవుతుంది అని హెచ్చరించారు. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ 800 నుంచి విజయ్ సేతుపతి… తప్పుకున్న కొన్ని గంటలకే చిన్న కుమార్తెను రేప్ చేస్తామని బెదిరించారు. ఇటీవల, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తెపై అత్యాచారం బెదిరింపులు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ సింగర్ చిన్మయి శ్రీపాద ట్విట్టర్‌ లోకి చెన్నై పోలీసులు, అడయార్ డిప్యూటీ కమిషనర్ పోలీసులను ట్యాగ్ చేశారు.