అసిస్టెంట్ డైరెక్టర్‌తో ప్రేమాయణం.. స్టార్ హీరోయన్ ప్రెగ్నెంట్ !

తెలుగమ్మాయి ఆనంది మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో మంచి హీరోయిన్‌ గా పేరు తెచ్చుకుంది నటి ఆనంది. బస్‌ స్టాప్‌, ఈ రోజుల్లో లాంటి సినిమా లలో నటించిన ఈ భామ.. ఆ తర్వాత తెలుగులో సక్సెస్‌ కాలేకపోయింది. దీంతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టి మంచి విజయాలు సాధిస్తోంది.

ఇక తాజాగా సుదీర్‌ బాబు హీరోగా.. కరుణ కుమార్‌ దర్శకత్వం లో రూపొందిన ”శ్రీదేవి సోడా సెంటర్‌ ” అనే సినిమాలో నందిని నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి టాక్‌ తెచ్చుకుంటోంది. అయితే… ఈ సినిమా ప్రమోషన్స్‌ లో ఆనంది పాల్గొనలేదు. అందుకు ఓ బలమైన కారణం ఉందట. అది ఏంటంటే… ఇప్పుడు ఈ భామ గర్భవతి అట. ఈ ఏడాది జనవరి 7వ తేఈన ఆమె అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సోక్రటీస్‌ ను లవ్‌ చేసి.. పెళ్లి చేసుకుంది. ఇక ప్రస్తుతం ఆమె గర్భం దాల్చినట్లు.. ఆరో నెల నడుస్తుండటంతోనే సినిమా ప్రమోషన్స్‌ లో పాల్గొనలేదని సమాచారం అందుతోంది.