టీఆర్‌ఎస్‌ కు షాక్‌… హుజురాబాద్‌ బరిలో 1000 మంది అభ్యర్థులు

-

హుజురాబాద్ ఉప ఎన్నిక ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఉప ఎన్నికల్లో ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించగా…. బిజెపి పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ తమ అభ్యర్థులను ప్రకటించలేదు. బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ అని ప్రచారం జరుగుతుండగా… అభ్యర్థి నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా దృష్టి సారించింది.

ఈ నేపథ్యం లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి దిమ్మ తిరిగే షాక్‌ తగిలింది. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో వెయ్యి మంది పోటీ చేస్తామని కాసేపటి క్రితమే ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రకటించారు. 16 ఏళ్ల నుంచి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తమను టిఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయంగా తొలగించిందని దుబ్బాకలో ఫీల్డ్ అసిస్టెంట్ల బిక్షాటన నిర్వహించారు.

హుజురాబాద్‌ లో పోటీ చేస్తామని ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లు స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓటమే లక్ష్యంగా పనిచేస్తామని ప్రకటించారు. త్వరలోనే హుజురాబాద్‌ లో ప్రచారం సాగిస్తామన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ల తాజా ప్రకటన తో హుజురాబాద్‌ ఉప ఎన్నిక మరింత రసవత్తంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news