నెలకు రూ.1,000 పొదుపు చేస్తే రూ.1,60,000 రిటర్న్స్ పొందండిలా..!

-

మీరు మీ డబ్బుల్ని దాచి ఎందులోనైనా ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటున్నారా..? అయితే మీరు తప్పక దీని కోసం తెలుసుకోవాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అద్భుతమైన అవకాశాన్ని కలిపిస్తోంది. ఎస్‌బీఐలో రికరింగ్ డిపాజిట్ అకౌంట్ ద్వారా మంచి రిటర్న్స్ పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

SBI

ఈ స్కీమ్ లో మీరు నెల నెలా రూ.100 నుంచి సేవింగ్స్ ని స్టార్ట్ చెయ్యచ్చు. పైగా లిమిట్ అంటూ ఏమీ లేదు. దీనిలో మీరు ఎంతైనా ఇన్వెస్ట్ చెయ్యచ్చు. అకౌంట్‌లో నెలకు రూ.1,000 పొదుపు చేసి రూ.1,60,000 వరకు రిటర్న్స్ పొందొచ్చు. అయితే కనీసం 12 నెలలు డబ్బులు డిపాజిట్ చేయాలి. గరిష్టంగా 120 నెలలు అంటే 10 ఏళ్లు డిపాజిట్ ని తప్పక చెయ్యాలి.

ఈ ఆర్డీ అకౌంట్ ని ఎవరైనా ఓపెన్ చెయ్యచ్చు. ఏ స్టేట్ బ్యాంక్ లో అయినా ఓపెన్ చెయ్యచ్చు. ప్రతీ నెలా డిపాజిట్ చెయ్యాలి. లేదు అంటే పెనాల్టీ పడుతుంది. 5 ఏళ్ల లోపు అకౌంట్‌కు నెలకు రూ.100 కి రూ.1.50 పెనాల్టీ, 10 ఏళ్ల లోపు అకౌంట్‌కు నెలకు రూ.100 కి రూ.2.00 పెనాల్టీ చెల్లించాల్సి వుంది.

ఆరు నెలల పాటు డబ్బులు పెట్టకపోతే అకౌంట్ క్లోజ్ అయ్యిపోతుంది. నామినేషన్ ఫెసిలిటీ కూడా వుంది. యూనివర్సల్ పాస్‌బుక్ లభిస్తుంది. ప్రస్తుతం 5 ఏళ్లలోపు డిపాజిట్లకు 5.30 శాతం, 5 నుంచి 10 ఏళ్ల లోపు డిపాజిట్లకు 5.40 శాతం వడ్డీ వస్తుంది. లోన్, ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version