ఈ స్కీమ్ తో మీ డబ్బులు డబల్.. పూర్తి వివరాలు ఇవే..!

-

దేశీయ దిగ్గజ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల కోసం ఎన్నో రకాల సేవలని అందిస్తోంది. ఈ సేవల వలన చాలా మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు రిస్క్ లేకుండా రాబడి పొందవచ్చు. అయితే ఎస్బీఐ ఎన్నో స్కీమ్స్ ని ఇస్తోంది. వాటిలో పలు రకాల ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఎఫ్‌డీ స్కీమ్స్ ఒక భాగమే. అందు వల్ల మీరు అదిరే రాబడి ని ఇలా సొంతం చేసుకోవచ్చు.

అధిక వడ్డీ రేటు ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు దాచుకుంటే మంచిది. చాలా బ్యాంకులు అధిక వడ్డీ రేటు తో ఎఫ్‌డీ స్కీమ్స్‌ను అందుబాటులో ఉంచాయి. ఇక ఎస్‌బీఐ అందించే స్పెషల్ స్కీమ్ వివరాలు చూసేద్దాం… ఈ స్కీము పేరు వచ్చేసి ఎస్‌బీఐ ఉయ్ కేర్ ఎఫ్‌డీ స్కీమ్. ఈ స్కీమ్ లో డబ్బులని పెడితే అధిక వడ్డీ రేటు సొంతం చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే అందుబాటులో వుంది ఈ స్కీము.

ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌ తో డబ్బులు ని పెట్టుకోవచ్చు. రూ. 2 కోట్ల వరకు మొత్తాన్ని డిపాజిట్ చెయ్యచ్చు. 7.5 శాతం వడ్డీ రేటు ని ఈ స్కీమ్ తో పొందవచ్చు. రెగ్యులర్ కస్టమర్లతో పోలిస్తే 30 బేసిస్ పాయింట్లు అధిక వడ్డీ ని ఈ స్కీమ్ తో పొందవచ్చు. లోన్ ఫెసిలిటీ కూడా దీనిలో వుంది. రూ. 5 లక్షలు పెడితే మెచ్యూరిటీ సమయంలో… రూ.10 లక్షలకు పైగా వస్తాయి. రూ. 5 లక్షలకు రూ. 5.5 లక్షల వడ్డీ వస్తుంది. సాధారణ కస్టమర్లకు పదేళ్ల టెన్యూర్‌పై 6.5 శాతం వడ్డీ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version