ప్రేమ కోసం పరితపిస్తున్న మెగా హీరో.. ఏమైందంటే..?

-

సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోలంతా కూడా ఒక్కొక్కరిగా వివాహం చేసుకొని.. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బ్యాచిలర్ లైఫ్ ను వీడి యంగ్ హీరోలు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.. యంగ్ హీరో శర్వానంద్ కూడా వివాహం చేసుకోగా ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా నిశ్చితార్థం చేసుకొని పెళ్లికి సిద్ధమవుతున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే యంగ్ హీరోలే ఇప్పుడు పెళ్లి చేసుకోవడంలో క్యూ కడుతున్నారు అనడంలో సందేహం లేదు. అయితే మెగా హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం ప్రేమ కోసం పరితపిస్తుంటే ఆయనకు ఒక అమ్మాయి కూడా పడడం లేదు అన్నట్లుగా కొంతమంది కామెంట్లు వినిపిస్తున్నాయి.

అసలు విషయంలోకి వెళ్తే తాజాగా.. పవన్ కళ్యాణ్ సాయి ధరంతేజ్ సముద్రఖని దర్శకత్వంలో బ్రో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 28వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల అభిమానులతో ముచ్చటించిన సాయి ధరంతేజ్ కు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అంటూ అభిమానులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించడం జరిగింది.

సాయి ధరంతేజ్ మాట్లాడుతూ.. ఇంకెక్కడ పెళ్లి బ్రో ఈ సినిమా టైటిల్ విడుదలైనప్పటి నుంచి అందరూ నన్ను బ్రో అంటూ పిలుస్తున్నారు.. ఈ సినిమా టైటిల్ విడుదల చేయకముందు వరకు ఎవరో ఒక అమ్మాయి అయినా నన్ను ట్రై చేసేది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది..ఈ సినిమా టైటిల్ ఎప్పుడైతే ప్రకటించారో అప్పటినుంచి నన్ను బ్రో అని పిలవడం మొదలుపెట్టేశారు. అంటూ సాయి ధరంతేజ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త వైరల్ గా మారగా.. ఇక ప్రేమ కోసం సాయి ధరమ్ తేజ్ పరితపిస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version