జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తాటతీస్తామని యాదవ సంఘం నేతలు హెచ్చరికలు జారీ చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. సిఐ అంజు యాదవ్ పై ఫిర్యాదు చేసేందుకు.. ఇవాళ తిరుపతికి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చారు యాదవ సంఘం నేతలు.
సిఐ అంజు యాదవ్ పై పవన్ కళ్యాణ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని… ఒక మా బీసీ మహిళ ఎంతో కష్టపడి చదివి సిఐ స్థాయిలో ఉందని వెల్లడించారు యాదవ సంఘం నేతలు. ఆమె ఏ తప్పు చేయలేదని… రోడ్డుపై ఎవరైనా ధర్నా చేస్తే పోలీసు వృత్తి ప్రకారం అలా అడిగారు… బీసీ కా మహిళా కాబట్టి ఇలా లోకువగా మాట్లాడుతున్నావా గత ప్రభుత్వంలో వనజాక్షిపై చింతమనేని దాడి చేస్తే మీరు ఏం చేశారు అని యాదవ సంఘం నేతలు ఫైర్ అవుతున్నారు. సీఐ జోలికి వస్తే తాట తీస్తామని హెచ్చరించారు.