విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం..!

-

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. యూనిట్ లో శనివారం మధ్యాహ్నం ఒక్క సారిగా మంటలు ఎగసి పడ్డాయి మంటలతో పాటుగా పొగలు కూడా భారీగా వచ్చాయి. ఈ ఘటన తో కార్మికులు భయంతో స్టీల్ ప్లాంట్ నుండి బయటికి పరుగులు తీశారు విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుంది.

ఈ ప్రమాదంలో ఎవరైనా చిక్కుకున్నారా అనేది తెలియాలి అటు ప్రమాదానికి గల కారణాలు ని ఫైర్ సిబ్బంది చూస్తోంది. ప్రస్తుతం ఎండలు పెరగడంతో షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మంటలు అదుపు చేయడానికి ట్రై చేస్తున్నారు ఘటన పై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news