సికింద్రాబాద్.. జింఖానా గ్రౌండ్స్ వద్ద 10 కేజీల గంజాయి సీజ్ చేసారు ఎక్సైజ్ STF అధికారులు. ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను అరెస్ట్ చేయగా.. మరో యువకుడు పరారీలో ఉన్నాడు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్, విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయం చేపట్టారు. జూమ్ కార్ యాప్ ద్వారా కార్ ను అద్దెకు తీసుకొని ఒరిస్సా వెళ్లిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు శేఖర్, ప్రవీణ్.. అక్కడ లో గంజాయి కొనుగోలు చేసి.. పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాకుండా గంజాయిని కారు సైడ్ డోర్స్ తో పాటు ముందు భాగంలో దాచి హైదరాబాద్ కు తరలించే యత్నం చేసారు కేటుగాళ్లు.
కానీ విశ్వసనీయ సమాచారం మేరకు జింఖానా గ్రౌండ్ వద్ద మాటు వేసిన STF అధికారులు.. అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపారు. ఇక STF అధికారులను కనిపెట్టి కారు దిగి ఓ యువకుడు పారిపోగా.. కారులో ఉన్న ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తమ దైన స్టైల్ లో విచారణ చేయగా.. కారులో దాచిన గంజాయి గుట్టు రట్టు అయ్యింది. హైదరాబాద్ లో జూమ్ కార్ యాప్ లో కారు అద్దెకు తీసుకొని ఒరిస్సా నుండి హైదరాబాద్ కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు ఒప్పుకున్న నిందితులు.. గంజాయి ని చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి విద్యార్థులకు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు అమ్ముతున్నారు.