నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల వైపు పరుగులు పెట్టాయి. మార్కెట్ వరుసగా నాలుగో రోజు కూడా లాభాల వైపు నడిచింది. నేటితో నాలుగు నెలల గరిష్ట స్థాయిలో మార్కెట్ ముగిసింది. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 466 పాయింట్లు లాభంతో 36,487 పాయింట్ల వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 156 పాయింట్ల లాభంతో 10,764 పాయింట్ల వద్ద ముగిసింది.
ఇక నేడు స్టాక్ మార్కెట్ లాభనష్టాల విషయానికి వస్తే… నిఫ్టీ 50 లో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, హిందాల్కో, టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాల బాట పడగా… మరోవైపు బజాజ్ ఆటో ,భారతి ఎయిర్టెల్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్, గెయిల్, విప్రో షేర్లు నష్టపోయాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్లో భారత రూపాయి మారకపు విలువ డాలర్ తో పోలిస్తే కేవలం రెండు పైసలు లాభపడి 74.68 వద్ద ట్రేడ్ జరుగుతోంది. అలాగే ముడి చమురు ధరలు కాస్త మిశ్రమంగా ముగిశాయి. అందులో బ్రెంట్ మోడీ చమురు 43.61 డాలర్లకు చేరుకోగా, డబ్ల్యూటీఏ ముడి చమురు 40.56 డాలర్లకు చేరుకుంది.