కెనడాలో వింత బ్రెయిన్ సమస్య… 48 కేసులు నమోదు..!

న్యూయార్క్ టైమ్స్ ప్రకారం కెనడియన్ ప్రావిన్స్ ఆఫ్ New Brunswick, వద్ద ఒక అరుదైన సమస్యతో పేషెంట్లు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ పేషెంట్లు చనిపోయిన వాళ్ళని కలలో చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో కన్నడ లో ఉండే వాళ్ళు తీవ్ర భయానికి గురి అవుతున్నారు.

ఈ అరుదైన వ్యాధి గురించి గుర్తించడానికి న్యూరాలజిస్ట్ పగలనక రాత్రనక ప్రయత్నం చేస్తున్నారు. సైంటిస్టులు ఈ సమస్య ఎందుకు స్ప్రెడ్ అవుతోంది అనేది తెలుసుకోలేక పోతున్నారు. అయితే దీనికి గల కారణం ఏమిటంటే..? సెల్ ఫోన్ టవర్ల ద్వారా రేడియేషన్ వస్తోందని దీని వల్ల ఈ సమస్య వస్తోంది అని కొందరు అంటున్నారు. మరి కొందరైతే వ్యాక్సిన్ కారణంగా ఈ సమస్య వస్తుందని అంటున్నారు.

ఏది ఏమైనా వీటికి ప్రూఫ్ లేదు. ఇప్పటికీ ఈ అరుదైన సమస్యతో ఆరుగురు మృతి చెందారు. సైంటిస్టులు ఆరేళ్ళ క్రితం నుండి ఇది స్ప్రెడ్ అవుతోంది అని గుర్తించారు. ఇప్పటికే ఆరుగురు ఈ అరుదైన వ్యాధి తో మరణించడం జరిగింది.

అయితే కొన్ని ప్రశ్నలకు సమాధానాలు కూడా సైంటిస్టుల దగ్గర లేవు. కనీసం ఇంత స్టడీ చేసినా దాని పేరు కూడా వాళ్ళకి తెలియడం లేదు. చాలా మంది ఇప్పటికే ఈ వ్యాధి గురించి ప్రశ్నలు అడుగుతున్నప్పటికీ సమాధానం లేదు.

ఇది జెనిటిక్ వల్ల వస్తుందా లేదా చేప తినడం వల్ల లేదా లేడి మాంసం తినడం వల్ల వస్తుందా అనేవి ఏమి తెలియవు. అయితే వీటి కోసం మేము తెలుసుకుందామని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు ఎక్స్పర్ట్స్.