ఈటలకు షాక్ ఇచ్చిన స్పీకర్!

హైదరాబాద్: మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఈటలకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదని సమాచారం. ఈటల విషయం తెలిసినా కావాలనే అపాయింట్ మెంట్ ఇవ్వలేదని ఈటల వర్గం ఆరోపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఫోన్ ద్వారా అపాయింట్‌మెంట్ ఇవ్వాలని స్పీకర్‌ను కోరామని చెబుతున్నారు. స్పీకర్ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక టీఆర్ఎస్ నేతల వ్యూహం ఉందని అంటున్నారు.

ఇదిలా ఉంటే కరోనా కారణంగా అపాయింట్ ఇవ్వడంలేదని స్పీకర్ కార్యాలయ వర్గాలు అంటున్నాయి. కరోనా తగ్గితే ఈటలకు సమాచారం ఇస్తామని ఈటలకు తెలిపినట్లు చెబుతున్నాయి.

ఈ పరిణామంతో ఈటల రాజేందర్ నేరుగా స్పీకర్‌ను కలిసి తన రాజీనామా ఇవ్వాలని భావిస్తున్నారట. అపాయింట్‌మెంట్ దొరకని పక్షంలో ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించాలని యోచిస్తున్నారట

మరోవైపు ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఢిల్లీ వెళ్లి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు