రేషన్ బియ్యం దారి మళ్లిస్తే కఠిన చర్యలు : మంత్రి నాదెండ్ల

-

రేషన్ బియ్యం దారి మళ్లించడంపై ఏపీలో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పేదలకు అందాల్సిన బియ్యాన్ని గతంలో కొందరు అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి.దీనిపై ఫోకస్ పెట్టిన ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలోని పలు రైసు మిల్లుల్లో తనిఖీలు నిర్వహించారు. పలు డాక్యుమెంట్లను పరిశీలించి అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇకమీదట ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాకినాడలో జరిపిన సోదాల్లో పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక కుటుంబం కనుసనల్లోనే పోర్టులో అక్రమ సరఫరా జరిగిందన్నారు.సీఎం చంద్రబాబుతో చర్చించి రేషన్ మాఫియాపై విచారణ చేయిస్తామని మంత్రి వార్నింగ్ ఇచ్చారు.పేదల బియ్యం దారిమళ్లింపుపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.రేషన్ బియ్యం దారి మళ్లించిన వారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు.సమగ్ర నివేదిక అందగానే చర్యలు తప్పవని హెచ్చరించారు.కేంద్రం నుంచి అదనపు వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news