రేవంత్ రెడ్డి అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా? నీకు ఆ అర్హత ఉందా? -KTR

-

రేవంత్ రెడ్డి అసలు నువ్వు ముఖ్యమంత్రివేనా? నీకు ఆ అర్హత ఉందా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు కేటీఆర్‌. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదికి అరికెపూడి గాంధీ రౌడీలలాగ వాహనాలు వేసుకొని వెలాడుతూ వస్తుంటే వారికి పోలీసు వాళ్లు ఎస్కార్ట్ గా వచ్చారని ఆగ్రహించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి మీద అరికెపూడి గాంధీ దాడి చేసిన నేపథ్యంలో వారి కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్.

అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ..ప్రాంతీయతత్వం మీద దాడులు గతంలో లేవు ఇప్పుడు ఉండవని వివరించారు. బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ ప్రజలు అండగా నిలిచారని రేవంత్ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆగ్రహించారు. కాంగ్రెస్ లో ఎందుకు చేరావ్… దిక్కుమాలిన pac పదవి కోసం ఇలాంటి మాటలు మాట్లాడిన గాంధీకి సిగ్గుండాలని ఆగ్రహించారు. ఒక్కసారి నియోజకవర్గ ప్రజలను అడిగితే… గాంధీ ఏ పార్టీలో ఉన్నాడో చెబుతారన్నారు. గాంధీని హౌజ్ అరెస్ట్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరిగేవి కావని వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news