విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

-

మంత్రి సీతక్క మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని అన్నారు.గంజాయి ని సంపూర్ణంగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు చేపడుతామని తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. భూకబ్జాదారులపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేస్తామని, అసంపూర్తిగా ఉన్న మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అన్నారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సీతక్క ఆదేశించారు. త్వరలో మరోసారి సమీక్ష సమావేశం ను నిర్వహిస్తామని…విధుల పట్ల నిర్లక్ష్యం చేసే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించారు.

ఇదిలా ఉంటే.. మహిళా శక్తి క్యాంటీన్ల ద్వారా అమ్మ చేతి వంట ప్రతి ఇంటికి చేరాలని , మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదిగి వేల మందికి ఉపాధి కల్పించాలని ఆమె ఆకాంక్షించారు. శుక్రవారం సెక్రటేరియెట్ గ్రౌండ్ ఫ్లోర్, మూడో ఫ్లోర్ లో మహిళ సంఘాలతో నిర్వహించే మహిళ శక్తి క్యాంటీన్లను సీఎస్ శాంతి కుమారి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో కలిసి ప్రారంభించారు మంత్రి సీతక్క.

Read more RELATED
Recommended to you

Latest news