రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించిన కేంద్రమంత్రి నిర్మల సీతారామన్

-

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ 53వ సమావేశం ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రైల్వే ప్రయాణికులకు శుభవార్త అందించారు. రైల్వే సేవలను బలోపేతం చేయడంలో భాగంగా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లతో సహా రైల్వే సేవలను వస్తు సేవలను జీఎస్టీ నుంచి మినహాయించారు. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌లతో పాటు, క్లోక్ రూమ్ సేవలు, వెయిటింగ్ రూమ్‌లు, రిటైరింగ్ రూమ్‌లు మరియు బ్యాటరీతో నడిచే కార్ సేవలు వంటి సేవలు కూడా పరోక్ష పన్ను విధానంలో ఎటువంటి లెవీలను ఆకర్షించవువని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇంట్రా-రైల్వే సరఫరా, వస్తువుల అమ్మకం కూడా జీఎస్టీ నుంచి మినహాయించారు.నామమాత్రపు రుసుములతో సుదూరపు ప్రయాణాలకు కూడా రైలు ద్వారా సులభమైంది. చాలా మంది ప్రయాణికులు రైల్వేపై ఆధారపడుతున్నారు. ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లు, రైల్వే సేవలపై పన్ను మినహాయిస్తూ..కేంద్రం తిపికబురు చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news