పోలవరం కుడికాలువ వద్ద విద్యార్థి గల్లంతు

-

తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో పోలవరం కుడికాలువ వద్ద ఏడుగురు విద్యార్థులు కలిసి ఈతకు వెళ్లారు. అందులో గౌతం అనే విద్యార్థి ప్రమాదవశాత్తు కుడికాలువలో గల్లంతు అయ్యాడు. అయితే, విద్యార్థి గల్లంతు అయిన విషయాన్ని తోటి విద్యార్థులు అతని తల్లిదండ్రులకు తెలపకుండా గోప్యంగా ఉంచారు.

ఎట్టకేలకు ఈ విషయం తెలుసుకున్న గౌతమ్ తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే కుడికాలువ గట్టుకు చేరుకున్న పోలీసులు గౌతమ్ మిత్రులను వివరాలు అడిగి సేకరించారు. గజ ఈతగాళ్లతో కాలువను మొత్తం జల్లెడ పట్టిస్తున్నారు. గౌతమ్ ఎక్కడ కొట్టుకుపోయాడో అక్కడి నుంచి కొద్ది దూరం వరకు గజఈతగాళ్లు వెతుకుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version