అరెస్టు నుంచి తప్పించుకోవడానికే కేటీఆర్ ఢిల్లీ టూర్ : సామ రామ్మోహన్ రెడ్డి

-

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఒకే నెలలో ఇది రెండో టూర్. ఈ క్రమంలోనే కేటీఆర్ మీద టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. ‘బీజేపీకి అద్దె మైక్’ అంటూ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. కాంగ్రెస్‌ను బద్నాం చేయాలని బీజేపీ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేసేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నారని విమర్శించారు.

అంతేకాకుండా, అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఎన్ని మూటలు ఢిల్లీకి తీసుకెళ్తున్నావ్? అని ప్రశ్నించారు. నేటి సాయంత్రం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం ముగియనున్నదని, అందుకే ఒక గంట ముందు ఢిల్లీలో హడావుడి ప్రెస్‌మీట్ అన్నారు. ‘నువ్వు నీ బీజేపీ బీ టీమ్ వేశాలు అందరికీ తెలుసు. రాజకీయ స్వార్థం కోసం తెలంగాణను అప్రతిష్టపాలు చేసే కుట్రలు చేస్తున్న తెలంగాణ ద్రోహి. నీ బాధ ప్రపంచ బాధ కాదు. అంగ‌న్ వాడీ చిన్నారుల‌కు కొత్త యూనిఫాంలు మొద‌లు.. అన్నదాతలకు బోన‌స్ దాకా అన్ని వ‌ర్గాల ప్రజలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ల‌బ్ది’ చేకూర్చిందన్నారు. ఇక మీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఢిల్లీ వేదికగా చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version