కరోనా వైరస్ నేపధ్యంలో భారత్ లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. జనాభా ఎక్కువ ఉన్న దేశం కావడంతో ఇప్పుడు ప్రభుత్వాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణా రాష్ట్రాలు షట్ డౌన్ ప్రకటించాయి. ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయి. వైరస్ వేగంగా విస్తరించే అవకాశం ఉన్న నేపధ్యంలో జనసమ్మర్ధ ప్రాంతాల్లో ప్రజలు ఉండకుండా జాగ్రత్తలు పడుతున్నాయి.
ఇక తెలుగు రాష్ట్రాలకు సరిహద్దున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కరోనా వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుంది. ఎన్ని చర్యలు తీసుకున్నా సరే ఆ రెండు రాష్ట్రాలను వైరస్ ఇబ్బంది పెడుతుంది. బెంగళూరు లో విదేశీ ఉద్యోగులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో అక్కడి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా బెంగలూరు మునిసిపల్ కమిషనర్ అనిల్ కుమార్ ఒక ట్వీట్ చేశారు
“హాస్టళ్లలోని విద్యార్థులు మరియు అతిధి గృహాలలో ఉండే విద్యార్ధులూ… తమ విద్యాసంస్థలు సెలవులు ప్రకటిస్తే వారి ఇళ్లకు / ఇంటి పట్టణాలకు తిరిగి వెళ్లాలని కోరారు. # COVID19 ముప్పు కారణంగా యజమానులు / అటువంటి PG లను నడుపుతున్నవారు కఠిన పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని ఆయన సూచించారు. కాగా బెంగళూరు లో వేలాది మంది ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు ఉంటారు.
Students in hostels & paying guest accommodations are requested to go back to their homes/home towns if their institutions have declared holidays. Rigorous hygiene standards to be maintained by owners/those running such PGs due to #COVID19 threat.#BBMP #Bengaluru #coronavirus pic.twitter.com/l1AmR4aUKq
— B.H.Anil Kumar,IAS (@BBMPCOMM) March 17, 2020