లోపలికి వచ్చే దారి ఉన్నప్పుడు..బయటకు వెళ్లే దారి కూడా ఉంటుంది.. అలాగే..పుట్టిన తర్వాత ఏదో ఒకరోజు చనిపోక తప్పదు. అయితే మనిషి చనిపోయే విషయం ఎవరికీ తెలియదు..పుట్టుక మన చేతుల్లో ఉంటుంది.. చావు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేని విషయం అంటుంటారు.. కానీ మనిషి చనిపోయే విషయం వారికి రెండు వారాల ముందే తెలుస్తుందట.. ఏంటి నమ్మడం లేదా..? సైంటిఫిక్‌గా నిరూపించారండి.. సంచలనం రేపుతున్న ఈ సైంటిఫిక్ స్టడీ ఏం చెప్తుందో మీకోసం..

మృత్యువు రాకముందే.. మృత్యువు సంకేతాలు ఒకటి కాదు అనేక రకాలుగా రావడం ప్రారంభమవుతుందని శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో గుర్తించారు. వైద్యరంగంతో సంబంధం ఉన్న చాలా మంది వ్యక్తులు ఈ సంకేతాలను అర్థం చేసుకుంటారట. మరికొందరు దీనిని కొట్టిపారేస్తుంటారు. సాధారణంగా చాలామందికి మృత్యువు సంకేతాలు తెలియవు. తమ ప్రియమైన వారు అకస్మాత్తుగా మరణించినప్పుడు శోకసంద్రంలో మునిగిపోతుంటారు. అయితే, మరణానికి కొన్ని రోజుల ముందు మరణ సంకేతాలు కనిపిస్తాయని ఆరోగ్య నిపుణుల పరిశోధనలో వెల్లడైంది.
మరణానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
UK ఆధారిత సంస్థ Web MD సుదీర్ఘ పరిశోధనల తర్వాత మరణం సంకేతాలను గుర్తించింది. ఈ పరిశోధన ప్రకారం.. ఎవరైనా మరణం సమీపిస్తున్నప్పుడు అతని ఆహారం, పానీయం తగ్గుతుంది. ఆ వ్యక్తి మునుపటి కంటే తక్కువగా మాట్లాడటం ప్రారంభిస్తాడట..ఈ అసాధారణ లక్షణాలు భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతోందనడానికి సంకేతం.
మరణానికి 2 వారాల ముందు నుంచే సంకేతాలు..
ఒకరి మరణానికి 1-2 వారాలు మిగిలి ఉన్నప్పుడు మరణం లక్షణాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయట…ఈ దశలో వ్యక్తి అన్ని సమయాలలో అలసటగా నిర్జీవంగా ఉంటాడు. చాలా బలహీనంగా కనిపిస్తాడట.. అతను కోరుకున్నప్పటికీ మంచం విడిచిపెట్టడానికి ధైర్యం చేయలేడు… అతని నిద్ర-మేల్కొనే విధానం కూడా మారుతుంది. ఈ సమయంలో మరణానికి దగ్గరగా ఉండే వారి ఆకలి, దాహం బాగా తగ్గుతుంది. అతని గుండె కొట్టుకోవడం, రక్తపోటు, శ్వాస విధానంలో మార్పులు కనిపిస్తాయి. ఇంటిని వదిలిపెట్టి అస్సలు రారు..
మలమూత్ర విసర్జనలో మార్పు..
మరణం 3-4 రోజులు (మరణ సంకేతాలు) మిగిలిపోయినప్పుడు ఆ వ్యక్తి మానసిక పరిస్థితి, కార్యకలాపాలలో కూడా మార్పు వస్తుందని పరిశోధనలో పేర్కొంది. ఇంకా మృత్యువు దగ్గరలో ఉన్నప్పుడు తన గురించి మరచిపోయే అవకాశం ఉంది. ప్రజలు అడిగేదానికి అతను ఖచ్చితంగా స్పందించలేడు. ఇంకా పలు విషయాల గురించి స్పష్టంగా మాట్లాడలేడు.
మరణించే సమయం దగ్గరపడుతున్న కొద్దీ, అతని చేతులు, కాళ్ళపై, అతని మోకాళ్లపై చర్మం నీలిరంగు- ఊదా రంగులోకి మారవచ్చు. మూత్రవిసర్జన, ప్రేగు కదలికలు ఆగిపోవచ్చు. లేదా వారే ఆపవచ్చు. వారి శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది..వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కొంటారు. ప్రమాదాల్లో చనిపోయే వారికి ఇవేవి ఉండవు. అనారోగ్యంతో ఉన్నవారికి మాత్రమే ఈ లక్షణాలు కనిపిస్తాయి.
