అలాంటి వెధవలను. అసలు వదలకండి అంటున్న హీరోయిన్..!!

-

సామాన్యుల నుండి సినీ సెలబ్రిటీలకు సైతం ఎన్నో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఇలాంటివి చాలా ఎక్కువగానే మనకు వినిపిస్తూ ఉంటాయి. ఇక సెలబ్రిటీలు సైతం ఏదైనా పబ్లిక్ ప్రదేశాలలోకి వెళితే ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేము. అభిమానులను కలవడానికి కొంతమంది హీరోయిన్స్ చాలా ఉత్సాహాన్ని చూపిస్తూ ఉంటారు.. ఈ సందర్భంలోనే కొంతమంది మాత్రం చాలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పవచ్చు.. ఇక ఎంతోమంది తమ మీద చేతులు వేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారని ఇలాంటి చాలా అవమానాలను హీరోయిన్స్ ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయని తెలియజేస్తూ ఉంటారు సినీ సెలబ్రేటీలు.

ఇటీవల ఒక హీరోయిన్ తనను అసభ్యకరంగా తాకారని ఒక వ్యక్తి చెంప పగలగొట్టడం మనం చూసే ఉన్నాము. ఇక అంతే కాకుండా సామాన్య ప్రజలపై జరిగే విషయాలపై కూడా స్పందిస్తూ ఉంటారు సినీ సెలబ్రిటీలు తాజాగా యువ హీరోయిన్ ఇలాంటి సంఘటనపైనే మాట్లాడడం జరిగింది ఆ ముద్దుగుమ్మ.. ఎవరో కాదు ఐశ్వర్య రాజేష్. ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాం. తెలుగు ఇండస్ట్రీలో ఐశ్వర్య రాజేష్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మొదట తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ చిన్నతనం నుంచి ఎన్నో కష్టాలు పడి హీరోయిన్గా ఎదిగింది.

ఇక తన తండ్రి కూడా ఒక నటుడే.. చిన్నతనంలోనే అనారోగ్య సమస్యలతో మరణించడంతో కుటుంబాన్ని మొత్తం ఈమె చూసుకోనేది . అలా చిన్నతనంలోనే ఎన్నో అనారోగ్య సమస్యలతో సతమతమయి కేవలం తన సొంత టాలెంట్ తోనే పైకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గానే ఉంటుంది. తాజాగా ఒక ఆటో డ్రైవర్ చేసిన పనిపై ఐశ్వర్య రాజేష్ స్పందించింది.. చెన్నైలో ఏసీజె ఇండియా కాలేజీలో జర్నలిజం చదువుతున్న ఇషితా సింగ్ అనే యువతి ఈ మధ్యనే తన ఊరికి వెళ్లి తిరిగి రావడం జరిగిందంట. ఒక హోటల్ దగ్గర వెళ్లేందుకు తన స్నేహితులతో కలిసి ఆమె ఆటో ఎక్కింది. అయితే ఆటో డ్రైవర్ ఆమెతో తప్పుగా ప్రవర్తించాడు. ఆమె శరీర భాగాలను కూడా చాలా అసభ్యకరంగా తాకారు. దీంతో అతనిపై పోలీసు ఫిర్యాదు కూడా చేసింది ఆ యువతి. అయితే అక్కడి నుంచి అతను పారిపోయాడు అని సమాచారం. ఇక ఈ విషయంపై ఐశ్వర్య రాజేష్ స్పందిస్తూ ఇలాంటి వెధవల్ని అసలు వదలకూడదు వెంటనే శిక్షించాలి అంటూ అతడిని అరెస్టు చేసిన పోలీసులకు తన కృతజ్ఞతలు తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version