ప్రధాని లక్ష్యంగా ఉగ్రదాడి..త్రుటి లో తప్పిన ముప్పు

-

సుడాన్‌ ప్రధాని అబ్దల్లా హమ్దోక్‌ తృటిలో ఉగ్రదాడి నుంచి తప్పించుకున్నారు. సోమవారం సూడాన్ రాజధాని ఖార్టూమ్‌లో ఓ సమావేశంలో పాల్గొనేందుకు వెళుతున్న ఆయన వాహనశ్రేణి పై ఉగ్రవాదులు బాంబుదాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే అదృష్టవశాత్తు ఆ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. నియంత పాలన సాగిస్తున్న అధ్యక్షుడు అల్‌ బషర్‌ గతేడాది ప్రజాస్వామ్య తిరుగుబాటు కారణంగా పదవీచ్యుతుడవ్వగా, హమ్దోక్‌ గత ఏడాది ఆగస్టు లో ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అయితే సోమవారం పేలుడు ఘటన సంభవించిన తరువాత తాను సురక్షితంగా మరియు మంచి స్థితిలో ఉన్నాను అంటూ ఆయనే స్వయంగా ట్వీట్ చేసి మరి తెలిపారు. తన డెస్క్ వద్ద నవ్వుతూ కూర్చున్న ఫోటో ను కూడా ట్వీట్ చేసి క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే, ఇప్పటికీ పాలనను వెనకనుండి నడిపిస్తున్న మిలటరీ నాయకులు.. హమ్దోక్‌కు పూర్తి అధికారాలు అప్పగించేందుకు సుముఖంగా లేకపోవడం తో పాటు ఏడాది నుంచి దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. ద్రవ్యోల్బణం 60 శాతానికి చేరగా, నిరుద్యోగిత 22.1శాతానికి పెరిగింది.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో హమ్దోక్‌పై ఉగ్రదాడి చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోపక్క అసలు ఈ దాడికి పాల్పడింది మేమే అంటూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థ కూడా బాధ్యత వహించలేదు. అసలు ఈ దాడికి ఎవరు పాల్పడ్డారు అన్న విషయం పై అధికారులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version