ట్రైన్ వస్తుండగా ట్రాక్ దాటేందుకు యత్నించిన కారు,ఇంతలో

-

అమెరికా లోని లాస్ ఏంజెల్స్ లో చోటుచేసుకున్న ఒక ఘటనకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ వీడియో సోషల్ మీడియా లో ఎవరు పోస్ట్ చేసారో తెలుసా స్వయంగా పోలీసులే. మెట్రో రైలు వస్తున్న సమయంలో ఎదో చాలా ఫాస్ట్ గా కారును పట్టాలు తప్పించేద్దాం అనుకున్న కారు యజమానికి ఒక్కసారిగా అనుకోని షాక్ తగిలింది. ఆ వీడియోలోని దృశ్యాల ప్రకారం.. మెట్రో రైలు వస్తుండటంతో.. పట్టాలపైకి ఎటువంటి వాహనాలు రాకుండా అధికారులు గేటు వేశారు. అయితే అటువైపుగా బీఎండబ్ల్యూ‌ కారలో వచ్చిన ఓ వ్యక్తి మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా రైలు వచ్చే సరికి పట్టాలు దాటేద్దాం అనుకుని ఏకంగా కారును పట్టాలవైపు పోనిచ్చాడు. అంతే.. వేగంగా వచ్చిన మెట్రో రైలు కారును ఢీకొట్టడం తో అదృష్టం కొద్దీ ఎలాంటి పెద్ద ప్రమాదం జరుగకుండా ఆ వ్యక్తి తప్పించుకోగలిగాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి మాత్రం స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తుంది.

అయితే ఈ ప్రమాదంకు సంబంధించిన దృశ్యాలు అక్కడ పక్కనే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అవ్వడం తో తాజాగా ఈ వీడియో ను లాస్ ఏంజెల్స్ పోలీసులు సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. ఇక ఇప్పుడు ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ‘రైల్వే ట్రాకుల వద్ద రోడ్డు దాటుతున్నప్పుడు.. పరిసరాలను జాగ్రత్తగా గమనించండి’ అంటూ ప్రజలకు సూచిస్తూ ఈ వీడియోను పోలీసులు షేర్ చేసినల్టు తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version