బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ లో సడన్ చేంజ్ అందుకేనా

-

రాజా సింగ్ గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే.. ఈయన ఏది చేసినా, ఏం మాట్లాడినా సంచలనమే… ఆయన కామ్ గా ఉన్న వార్తనే..ఎప్పుడూ న్యూస్ లో ఉండే వ్యక్తి..తాజాగా ఆయన ప్రవర్తనలో వచ్చిన మార్పు పై పార్టీ లోను రాజకీయ వర్గాల్లోనూ బాగానే చర్చ జరుగుతోంది. గ్రేటర్ ఎన్నికల టైం లో ఆయన లో చేంజ్ వచ్చిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.. దుబ్బాక ఎన్నికల టైమ్ నుండే రాజా సింగ్ పార్టీ లైన్ లోకి వచ్చాడు.. ఒక వైపు ధర్మం , గోవు ముఖ్యం దానికోసం పార్టీ ని పదవిని తొక్కేస్తా అంటూనే పార్టీ నేతలతో ఆంటీముట్టనట్టు ఉండే ఆయన సడన్ గా ఎందుకు రూటు మార్చారు…

ధర్మం , గో రక్షణ కి ఇచ్చినంత ప్రాముఖ్యత రాజాసింగ్ పార్టీ కి ఇవ్వరంటారు..రీసెంట్ గా ఆయన అలాంటి కామెంట్స్ కూడా చేసాడు.. దేశం కోసం,ధర్మం కోసం, గో రక్షణ కోసం పార్టీ ని, పదవిని తొక్కేస్తానని చెప్పారు.. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా కూడా చేస్తానని పార్టీ కి తెలిపానన్నారు.. అయితే ఆయన పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు..రాష్ట్ర కమిటీ నియామకం సందర్భంగా, గ్రేటర్ ఎన్నికల సీట్ల కేటాయింపు సందర్భంగా అలక బూనిన రాజా సింగ్, బండి సంజయ్ పై కామెంట్స్ కూడా చేసాడు..

ఆయితే ఇప్పుడు సీన్ మారింది.. రాజా సింగ్ బండి సంజయ్ కి దగ్గర అయ్యారు..నెక్లేస్ రోడ్ లో సంజయ్ ని టీఆర్ఎస్ ను అడ్డుకున్న వెంటనే స్పందించి బీజేపీ కార్యాలయానికి వచ్చి సంజయ్ ని కలిసిన వ్యక్తి రాజా సింగ్,ప్రెస్ కాన్ఫరెన్స్ లోను మాట్లాడారు.. పాత బస్తి దేవాలయం ఆక్రమణ ఆందోళన సందర్భంగాను బండి సంజయ్ వెంటే రాజా సింగ్ ఉన్నాడు..గో అక్రమ రవాణా విషయంలో రాజా సింగ్ చేసిన కామెంట్స్ కి సంజయ్ మద్దతు గా నిలిచారు..

భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర కార్పొరేటర్ ల ప్రమాణం సందర్భం లోను రాజా సింగ్ ఉన్నారు…బీజేపీ కార్యాలయం లో జరిగిన అటల్ జయంతి కార్యక్రమంలో ను పాల్గొన్నారు.గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రోజులోను పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆయన సంజయ్, కిషన్ రెడ్డి ఇతర నేతలతో కలుపుగోలు గా కనిపించారు… ధర్మ రక్షణ ,గో రక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూనే , పార్టీ లో కూడా తన స్థానం,పట్టుని పెంచుకోవడం కోసం రాజా సింగ్ ముందుకు వెళ్తున్నారని పార్టీ లో చర్చ జరుగుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version