పద్మభూషణ్ అందుకున్న సుధామూర్తి

-

పద్మశ్రీ సుధా మూర్తి , ఒక భారతీయ సంఘ సేవకురాలు, రచయిత్రి. కంప్యూటర్ ఇంజనీర్ గా జీవితాన్ని ప్రారంభించి ఇన్‍ఫోసిస్ ఫౌండేషన్ , గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్య విభాగాలలో కీలక పాత్రలను పోషిస్తున్నారు . ఈవిడ పలు అనాధాశ్రమాలను ప్రారంభించింది. అలాగే గ్రామీణాభివృద్దికి సహకరించింది. కర్ణాటక లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు కంప్యూటర్లు అందించి తద్వారా పేద విద్యార్థులు కూడా ఉచితంగా కంప్యూటర్ జ్ఞానాన్ని పొందగలిగేందుకు తోడ్పడినది. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ గ్రంథాలతో ది మూర్తి క్లాసికల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ప్రారంచించింది. తన వృత్తి జీవితంతో బాటు ఈవిడ ఒక మంచి కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయురాలు, కాల్పనిక రచనలు కూడా చేస్తుంది. ఈమె రచించిన కన్నడ నవల డాలర్ సొసే (డాలర్ కోడలు) ఆంగ్లములో డాలర్ బహుగా అనువదించబడింది. తర్వాత ఇదే నవల 2001 లో జీ టీవీ లో ధారావాహికగా ప్రసారమైనది.

విద్యావేత్త, రచయిత అంతకుమించి గొప్ప మానవతామూర్తిగా ఆమె పేరు పొందారు. ఇన్ఫోసిస్ కో- ఫౌండర్ నారాయణమూర్తి భార్య అయిన సుధా మూర్తి.. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా కూడా కొనసాగుతున్నారు. ఈమె చాలా సాధారణ జీవితం గడుపుతారు. దాతృత్వ కార్యక్రమాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంటారు. ఈమె కోట్లాది భారతీయులకు స్ఫూర్తి. సుధామూర్తి- నారాయణమూర్తి కుమార్తె అక్షతా మూర్తి.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ భార్య.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version