గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్ నేపథ్యంలో బొమ్మలరామారం వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కీసర సమీపంలో ఎమ్మెల్యే రాజాసింగ్ ను అడ్డుకున్న పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యేల అరెస్టులతో, రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నేతల గృహ నిర్బంధాలతో తెలంగాణ రాష్ట్రం అట్టుడుకుతోంది.

ఇదిలా ఉంటే హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట శామీర్ పేట లోని ఈటల రాజేందర్ ఇంటికి వచ్చిన పోలీసులు, బండి సంజయ్ అరెస్ట్ నేపధ్యంలో బొమ్మల రామారాం పోలీస్ స్టేషన్ కు వెళ్ళడానికి అనుమతి లేదని పేర్కొన్నారు. దీంతో బిజెపి రాష్ట్ర ఆఫీసుకి వెళుతుండగా హకీం పేటలో ఈటల రాజేందర్ ను అడ్డుకున్న పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా అరెస్టు చేస్తున్నట్టు వెల్లడించారు.

బండి సంజయ్ అరెస్ట్ వివరాలు తెలుసుకోవడానికి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఎమ్మెల్యే రఘునందన్ రావు పై పోలీసులు విరుచుకుపడ్డారు. రఘునందన్ రావు ను చొక్కా పట్టి బలవంతంగా లాగి పోలీస్ వాహనం వద్దకు తీసుకెళ్లిన పోలీసుల తీరుతో అక్కడ ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కారణం చెప్పాలన్న రఘునందన్ రావుకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version