సెలబ్రిటీలకే షాక్ ఇచ్చిన సుడిగాలి సుధీర్. చిత్రమ్మ కూడా ఫిదా..!!

-

సుడిగాలి సుధీర్.. ప్రస్తుతం బుల్లితెర మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇతడి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక మనిషిలో ఇన్ని టాలెంట్స్ ఉంటాయా అని చెప్పడానికి సుధీర్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. రామోజీరావు ఫిలిం సిటీ లో మెజీషియన్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన సుధీర్.. ఆ తర్వాత ప్రముఖ కమెడియన్ వేణు సలహా మేరకు జబర్దస్త్ లో అతని టీం లోనే స్క్రిప్టు రైటర్ గా పనిచేసే అవకాశాన్ని సంపాదించుకున్నాడు. అలా జబర్దస్త్ కి వేణు సహాయంతో అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే టీం లీడర్ గా గుర్తింపు తెచ్చుకొని, తన స్నేహితులు ఆటో రాంప్రసాద్ , గెటప్ శ్రీను లతో కొన్ని వందల స్కిట్లు చేసి అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులకు బాగా రీచ్ అయ్యాడు . సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా అటు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మరోవైపు హీరోగా.. ఇక్కడ బుల్లితెరపై కమెడియన్గా, పలు షోలకు యాంకర్ గా , డాన్సర్ గా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో టాలెంట్స్ తో ప్రేక్షకులను బాగా మెప్పిస్తున్నాడు.

అంతేకాదు ఈటీవీ మల్లెమాలవారు ఏర్పాటు చేసే పలు ప్రత్యేకమైన ప్రోగ్రామ్లలో పాటలు పాడి సింగర్ గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే తన టాలెంట్ తో సెలబ్రిటీలకు కూడా షాక్ ఇచ్చాడు సుధీర్. తెలుగు రాష్ట్రాలలో ఉన్న చిన్నపిల్లల సింగింగ్ టాలెంట్ ను గుర్తించేందుకు తీసుకువచ్చిన సూపర్ సింగర్ జూనియర్ షో కి యాంకర్ గా అనసూయతో పాటు సుదీర్ కూడా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ షో సక్సెస్ఫుల్గా నడవడానికి ప్రతి వారం కూడా ఏదో ఒక కొత్త థీమ్ ను పరిచయం చేస్తున్నారు. ఇక ఇందులో భాగంగానే వచ్చేవారం.. పల్లెటూరుకు పట్నం జోరుకి మధ్య రసవత్తర పోరు అనే కాన్సెప్ట్ ను తీసుకురాగా అందులో సుదీర్ కామెడీ అలాగే ఆయన సింగింగ్ హైలెట్ అయ్యాయి.

ఇక ఈ షోలో జడ్జిగా చేస్తున్న లెజెండరీ సింగర్ చిత్రతో కలిసి సుధీర్ “అందం హిందోళం ” అనే పాటను చాలా అద్భుతంగా ఆలపించాడు. సుధీర్ పాడిన పాటతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అంతేకాదు పాట కంప్లీట్ అవ్వగానే పిల్లలంతా వచ్చి సుదీర్ ను గట్టిగా హత్తుకొని కంగ్రాట్స్ చెప్పారు. ఇక చిత్ర కోరిక మేరకు సెట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి మరి సుదీర్ ను అభినందించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version